కృష్ణయ్య చేతుల మీదుగా నియామక పత్రం అందుకుంటున్న జగన్
ఆమనగల్లు: గాడ్గె రజక యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆమనగల్లుకు చెందిన ఎన్ జగన్‌ను నియమితులయ్యారు. నగరంలోని బీసీ భవన్‌లో ఆదివారం రాష్ట్ర గాడ్గె రజక సంఘం సమావేశం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర గాడ్గె రజక సంఘం, యువజన సంఘాలకు నూతన సభ్యులను ఎన్నుకున్నారు. జగన్‌కు ఆర్.కృష్ణయ్య నియామకపు పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు.
రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ పోటీలు ప్రారంభం
షాద్‌నగర్: న్యూ పవర్ కుంగ్‌ఫూ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం షాద్‌నగర్‌లోని గణేష్ గార్డెన్‌లో రాష్ట్రస్థాయి కుంగ్‌ఫూ, కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను పాలమూరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ పీ విష్ణువర్ధన్‌రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ యుద్ధ విద్యలు నేర్చుకోవాలన్నారు. యువతకు చదువు ఎంత ముఖ్యమే యుద్ధ విద్యలు కూడా అంతే ముఖ్యమన్నారు. విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు న్యూపవర్ కుంగ్‌ఫూ అకాడమీ వారు ఈ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మోహన్‌సింగ్, లష్కర్ నాయక్, డాక్టర్ జగన్ చారి తదితరులు పాల్గొన్నారు.
పోటీలను ప్రారంభిస్తున్న నాయకులు


