జిల్లాకు చేరుకున్న ఎన్నికల పరిశీలకులు
సిరిసిల్ల: ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు పి.రవికుమార్, కె.రాజ్‌కుమార్ గురువారం జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో అందుబాటులో ఉంటారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌రూమ్, హెల్ప్‌లైన్, మీడియా సెంటర్‌ను సాధారణ పరిశీలకుడు రవికుమార్ పరిశీలించారు. ఎన్నికల ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సూచించారు. నోడల్ అధికారులు భారతి, ప్రకాశ్, డీపీఆర్వో లక్ష్మణ్‌కుమార్, కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్ సిబ్బంది ఉన్నారు.


