ఆరోగ్య పథకాలపై నిర్లక్ష్యం వద్దు
● డీఎంహెచ్‌వో రజిత
సిరిసిల్లటౌన్: ఆరోగ్య పథకాల అమలులో నిర్లక్ష్యం చేయొద్దని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత హెచ్చరించారు. జిల్లాలోని పీహెచ్‌సీ వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలతో గురువారం ఆరోగ్య కేంద్ర పథకాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వంద శాతం లక్ష్యాలు సాధించి జిల్లాను ప్రథమస్థానంలో ఉంచాలన్నారు. డయాబెటీస్, రక్తపోటు, క్యాన్సర్‌లను సకాలంలో గుర్తించి, చికిత్స అందించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించినారు. జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ రామకృష్ణ, వైద్యులు అనిత, నహీమ తదితరులు పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కేంద్ర ప్రభుత్వ అండతో పల్లెలు అభివృద్ధిలో పరుగులు పెడతాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. తంగళ్లపల్లిలోని పార్టీ ఆఫీస్‌లో గురువారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ అప్పుల ఊబిలో కూడుకుపోయిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెబుతున్నారని అలాంటి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు సర్పంచ్, వార్డుసభ్యులుగా గెలిపిస్తే చివరికి చిప్ప చేతికి వస్తుందని ఎద్దేవా చేశారు. కేంద్రం ద్వారా నిధులు తెచ్చి పల్లెలను అభివృద్ధి చేసే సత్తా కేంద్రమంత్రి బండి సంజయ్‌కుమార్‌కు ఉందన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, మండల అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు, జిల్లా నాయకుడు ఆసాని రాంలింగారెడ్డి పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన అవసరమని జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం పేర్కొన్నారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరు మండల పరిషత్‌లో గురువారం నషా ముక్త్ భారత్ అభియాన్, మిషన్ పరివర్తన, మహిళ సాధికారత, సఖీ కేంద్రం సంయుక్తంగా అవగాహన సదస్సు నిర్వహించారు. స్కూళ్లలో క్రమశిక్షణతో ఉన్నా ఇంటి వద్ద తల్లిదండ్రుల నియంత్రణ లేకపోవడంతో సెల్‌ఫోన్, డ్రగ్స్‌కు ఆకర్షితులవుతున్నారన్నారు. జిల్లా జెండర్ స్పెషలిస్టు దేవిక, హెచ్‌ఎం చక్రవర్తుల రమాదేవి, ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్, తోట శ్రీనివాస్, మాధవి, ఉమా, రాజమల్లు, రవికుమార్, భైరి వాణిశ్రీ, కల్పన, వీణ పాల్గొన్నారు.
గంభీరావుపేట(సిరిసిల్ల): అంతర్జాతీయ సాహిత్య సదస్సుకు(తానా) గంభీరావుపేట మండలం లింగన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు రిషిక పద్యం, రాజశేఖర్ వచన కవితల విభాగాల్లో ఎంపికై నట్లు తెలుగు ఉపాధ్యాయులు నరేందర్, రాజయ్య తెలిపారు. వీరు ఈనెల 30న ఆన్‌లైన్‌లో తమ కవితలను వినిపించనున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా వీరిని ఎంపిక చేశారు.
ఆలయ ఉద్యోగులకు బయోమెట్రిక్
వేములవాడ: ఆలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానాన్ని గురువారం నుంచి అమల్లోకి తీసుకొచ్చారు. ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రారంభమైన నేపథ్యంలో భీమేశ్వర ఆలయంలో ఉద్యోగులకు విధులు కేటాయించారు. ఈక్రమంలో ఈవో రమాదేవి ఉద్యోగుల విధులపై ప్రత్యేక నజర్ పెట్టారు. ఇందులో భాగంగానే బయోమెట్రిక్‌ను అమల్లోకి తీసుకొచ్చారు.
ఆరోగ్య పథకాలపై నిర్లక్ష్యం వద్దు
ఆరోగ్య పథకాలపై నిర్లక్ష్యం వద్దు
ఆరోగ్య పథకాలపై నిర్లక్ష్యం వద్దు


