రూప్లానాయక్ తండాలో విభేదాలు
సిరిసిల్ల: రుద్రంగి మండలం రూప్లానాయక్ తండావాసులు తమ సర్పంచ్‌గా జవహర్‌లాల్‌నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లుగా బుధవారం ప్రకటించారు. ఈ ఏకగ్రీవ ఎన్నిక వెనక సదరు అభ్యర్థి గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి తన సొంత స్థలం నుంచి గుంటన్నర ఇస్తానని ఒప్పుకోవడంతో ఏకగ్రీవానికి అంగీకరించినట్లు సమాచారం. ఇదే గ్రామపంచాయతీ పరిధిలోనే ఉన్న వర్జియాతండా వాసులు ఆ ఏకగ్రీవాన్ని విభేదించినట్లు సమాచారం. నామినేషన్లపర్వం సాగుతుండగానే.. ఏకగ్రీవం కావడం పరిపాటి. కానీ గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి భూమిని ఇస్తానని ఎరగా చూపి ఏకగ్రీవానికి ఎత్తులు వేసినట్లు ఇంటలీజెన్స్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పటికై తే రూప్లానాయక్‌తండాలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. రేపటి వరకు నామినేషన్లకు అవకాశం ఉండడంతో ఏకగ్రీవమవుతుండా? తండావాసుల ఐక్యత దెబ్బతింటుందా? అనే అనుమానాలు ఉన్నాయి. ఆదిలోనే హంసపాదు అవుతుందనే సంకేతాలు అందుతున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికల నిబంధనల మేరకు ప్రలోభాలతో ఏకగ్రీవం చేస్తే.. నేరమవుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఐక్యతతో వార్డు సభ్యులకు, గ్రామ సర్పంచ్‌కు ఒక్కో నామినేషన్ తిరస్కరణకు గురికాకుండా దాఖలైతేనే ఏకగ్రీవమైనట్లు భావిస్తారు. ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహక పారితోషికం లభించే అవకాశం ఉంటుంది.


