బిర్సాముండాకు నివాళి
సిరిసిల్ల: గిరిజన ఉద్యమ నాయకుడు బిర్సా ముండా జయంతిని కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సైబర్ నేరాల నుంచి అప్రమత్తతే రక్షణ
సిరిసిల్లక్రైం: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేశ్ బీ గీతే తెలిపారు. అత్యాశకు పోయి వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ ఖాతాల సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరించారు. ఇప్పటి వరకు జిల్లాలో 64 సైబర్ కేసులు నమోదు కాగా, సైబర్ క్రైమ్ టీం చర్యలతో రూ.54,97,683 రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు తెలిపారు. నేరం జరిగిన వెంటనే స్పందించడంతో రూ.36,29,853 ఫ్రీజ్ చేసినట్లు చెప్పారు. రుణయాప్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫర్లు, క్యూఆర్ కోడ్స్‌పై జాగ్రత్తగా ఉండాలన్నారు. మోసపోతే వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.
బిర్సాముండాకు నివాళి


