● నిబంధనలతో నిర్మాణంలో జాప్యం ● పైలట్ గ్రామాల్లోనూ ముం
ఇందిరమ్మ పథకం వివరాలు ఇలా..
ముస్తాబాద్(సిరిసిల్ల): నిరుపేదలకు గూడు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం క్షేత్రస్థాయిలో నెరవేరడం లేదు. అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. జిల్లాలో 7,408 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఇందిరమ్మ కమిటీల ద్వారా అర్హులను ఎంపిక చేశారు. అయితే 35 ఇళ్లు మాత్రమే ఇప్పటి వరకు పూర్తయ్యాయి. క్షేత్రస్థాయిలో ఇసుక కొరత ఏర్పడడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో పనులు ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తున్నా పనులు ముందుకుసాగడం లేదు.
అడుగడుగునా ఆటంకాలు
సొంతంగా స్థలం ఉండి ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటిని మంజూరు చేసింది. ఇంటి విస్తీర్ణం 600 ఫీట్లు దాటవద్దనే నిబంధనతో కొంతమందిని నిరాశకు గురిచేస్తోంది. మరికొందరి కి స్థలం లేకపోవడం, స్థలం వివాదాలు, ఇంటి పనులు మొదలుపెట్టుకునే ఆర్థిక స్థోమత లేకపోవ డం, ముహూర్తాలు కుదరకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇసుక లభించకపోవడం, నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం లబ్ధిదారులను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రధానంగా స్టీల్, ఇటు క, మేసీ్త్ర, ఇసుక ధరలు పెరగడంతో లబ్ధిదారులు సకాలంలో పనులు మొదలు పెట్టలేకపోతున్నారు.
ఇండ్ల మంజూరు : 7,408
ముగ్గులు పోసినవి : 5,491
పనులు నడిచేవి : 4,203
ముగ్గులు పోసేవి: 1,917
బేస్‌మెంట్ లెవెల్ : 4,203
ప్రహరీ లెవెల్ : 2,343
స్లాబ్ లెవెల్ : 1,298
పూర్తయిన ఇండ్లు : 35(నవంబర్ 14 నాటికి)
● నిబంధనలతో నిర్మాణంలో జాప్యం ● పైలట్ గ్రామాల్లోనూ ముం


