సకాలంలో టీకాలు వేయాలి
● జిల్లా వైద్యాధికారి రజిత
సిరిసిల్ల: పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలను సకాలంలో వేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత ఆదేశించారు. స్థానిక అంబేడ్కర్‌నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని శనివారం తనిఖీ చేశారు. వ్యాక్సిన్లు నిల్వ చేసే విధానం, ప్యాకింగ్‌ను పరిశీలించారు. ఐదేళ్లలోపు పిల్లలకు విధిగా టీకాలు వేయించాలన్నారు. వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ సంపత్‌కుమార్, నవీన పాల్గొన్నారు.
ఎల్లారెడ్డిపేట/గంభీరావుపేట(సిరిసిల్ల): పదో తరగతిలో విద్యార్థులు ప్రణాళికబద్దంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి వినోద్ కుమార్ అన్నారు. గంభీరావుపేట మండలం గజసింగవరం, సముద్రలింగాపూర్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ స్కూళ్లను శనివారం తనిఖీ చేశారు. విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనం తీరుతెన్నులను పరిశీలించారు. ఎంఈవో గంగారాం, హెచ్‌ఎం చంద్రశేఖర్ ఉన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యాసంస్థల్లో ర్యాగింగ్ భూతాన్ని తరిమికొట్టాలని సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి కోరారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్‌పై శనివారం అవగాహన కల్పించారు. సీఐ మొగిలి మాట్లాడుతూ ర్యాగింగ్ అంటే ఏమిటీ? దానికి సంబంధించిన చట్టపరమైన పరిణామాలు, ఎఫ్‌ఐఆర్, క్రిమినల్ కేసులు, సస్పెన్షన్, జైలుశిక్షల గురించి వివరించారు. ర్యాగింగ్‌కు పాల్పడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. అసోసియేట్ డీన్ డాక్టర్ సునీతాదేవి, ఓఐఎస్‌ఏ కోఆర్డినేటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్.రాజా, తంగళ్లపల్లి ఎస్సై ఉపేంద్రచారి పాల్గొన్నారు.
సిరిసిల్ల అర్బన్: మధ్యాహ్న భోజన కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు, వంట బిల్లులు, 10 నెలల కోడిగుడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి గురిజాల శ్రీధర్ కోరారు. కలెక్టరేట్ ఎదుట శనివారం మధ్యాహ్న భోజన నిర్వాహకులతో కలిసి నిరసన తెలిపి మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న భోజన నిర్వాహకులకు బిల్లులు సరిగ్గా రావడం లేదన్నారు. ఇప్పటికై నా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. నాయకులు మల్లారపు అరుణ్‌కుమార్, గొట్టె బాలమణి, పులి వసంత, వెంకటలక్ష్మి, గడ్డం పద్మ, కవిత, గౌరవ్వ తదితరులు పాల్గొన్నారు.
పీఆర్సీ అమలు చేయాలి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గత పీఆర్సీ గడువు ముగిసి రెండేళ్లు గడిచినా పీఆర్సీ ప్రకటించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని దుమాల హైస్కూల్‌లో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై శనివారం టీచర్లతో సమావేశమయ్యారు. అనిల్‌కుమార్ మాట్లాడుతూ ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ ప్రకటించాలని కోరారు. జిల్లా కమిటీ కార్యదర్శి చకినాల రామచంద్రం, మండల అధ్యక్షుడు కదిరే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సతీశ్ పాల్గొన్నారు.
సకాలంలో టీకాలు వేయాలి
సకాలంలో టీకాలు వేయాలి
సకాలంలో టీకాలు వేయాలి
సకాలంలో టీకాలు వేయాలి


