అంగన్‌వాడీ భవనాలు ప్రారంభం
వీర్నపల్లి(సిరిసిల్ల): మండలంలోని మద్దిమల్ల, భూ క్యతండా, కంచర్ల గ్రామాల్లో నిర్మించిన అంగన్‌వాడీ కేంద్రాలను శనివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజంతో కలిసి ప్రారంభించారు. జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ప్రీస్కూల్ విద్య, పౌష్టికాహారం అందుతుందన్నారు. మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో భవిత భవనానికి భూమిపూజ చేశారు. తహసీల్దార్ ముక్తార్‌పాషా, ఎంపీడీవో శ్రీలేఖ, సీడీపీవో ఉమారాణి, ఎంఈవో కృష్ణహరి, ఎంపీవో బీరయ్య, ఆర్‌ఐ శివకుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాములునాయక్, వైస్‌చైర్మన్ లెంకల లక్ష్మణ్, సూపర్‌వైజర్ మమత, ఎస్సై లక్ష్మణ్ పాల్గొన్నారు.


