లోక్ అదాలత్‌లో 303 కేసులు పరిష్కారం
సిరిసిల్లకల్చరల్: జిల్లా వ్యాప్తంగా శనివారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అదాలత్‌లో 303 కేసులు పరిష్కారమయ్యాయి. రూ.61,53,958 నష్టపరిహారం ఇిప్పించినట్లు జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి బి.పుష్పలత తెలిపారు. మోటార్ వాహన ప్రమాద కేసులు 1, సివిల్ తగాదాలు 14, భూసేకరణ 2, క్రిమినల్ 278, ఎకై ్సజ్ 4, చెక్ బౌన్స్ 3, కుటుంబ తగాదాల కేసులు ఒకటి పరిష్కారమయ్యాయి. పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధికా జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి పి.లక్ష్మణాచారి, ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె.సృజన, రెండో అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.మేఘన, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్, లోక్ అదాలత్ సభ్యులు గుర్రం ఆంజనేయులు, ఆడెపు వేణు, చింతోజు భాస్కర్, న్యాయవాదులు పాల్గొన్నారు.


