జాగిలాలతో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

జాగిలాలతో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

Nov 7 2025 6:47 AM | Updated on Nov 7 2025 6:47 AM

జాగిల

జాగిలాలతో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

రోడ్డు పనులు ప్రారంభం

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో నార్కోటిక్‌ జాగిలాలతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాగ్‌పూర్‌ నుంచి చాక్లెట్ల రూపంలో గంజాయి మత్తు విస్తరిస్తుందని సాక్షిలో గురువారం కథనం ప్రచురితమైంది. దీన్ని సీరియస్‌గా పరిగణించిన ఎస్పీ మహేశ్‌ బి గితే టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు, నార్కోటిక్‌ జాగిలాలతో విస్తృతంగా తనిఖీలు చేయించారు. సిరిసిల్ల పట్టణ పరిధిలోని పాన్‌ షాపులు, లాడ్జీలు, షాపులు, అనుమానితుల ఇళ్లలో తనిఖీలు చేశా రు. గంజాయి వినియోగించిన, విక్రయించిన కేసుల్లో నిందితులుగా ఉన్న పాత నేరస్తులను ప్రత్యేకంగా జాగిలాలతో తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంతోపాటు శివారు ప్రాంతాల్లోనూ తనిఖీ చేపట్టారు. టాస్క్‌ఫోర్స్‌ సీఐ నటేశ్‌ మా ట్లాడుతూ.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజా యి లాంటి మత్తు పదార్థాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా పోలీస్‌ శాఖ పని చేస్తోందన్నారు.

వేములవాడ: రోడ్ల వెడల్పు ప్రక్రియ నవంబర్‌ ప్రారంభమైనా ముందుకు సాగకపోవడంతో ‘సాక్షి’లో ఈనెల 3న ‘ముందుకు సాగని విస్తరణ పనులు’ పేరిట కథనం ప్రచురితమైంది. స్పందించిన అధికారులు మెయిన్‌రోడ్డు పనులు ప్రారంభించారు. దీంతో భక్తులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పనులు త్వరగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయొద్దు

ఇల్లంతకుంట: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ అన్నారు. గురువారం ఇల్లంతకుంట మండలం వెల్జిపురం, దాచారం గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ప్రతీరోజు ధాన్యం తూకం వేయాలని, భర్తీ అయిన లారీలను వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. అకాల వర్షాల వల్ల ధాన్యం తడవకుండా ఉండేందుకు కవర్లు కప్పి ఉంచాలని రైతులకు సూచించారు. దాచారంలో మోంతా తుపాన్‌తో గండిపడ్డ బానప్పకుంటను సందర్శించి నష్టపోయిన పంటపొలాలను పరిశీలించారు. చింతలకుంటపల్లె రైస్‌మిల్లును సందర్శించి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్‌ ఎంఏ ఫరూక్‌, ఐకేపీ ఏపీఎం లతా మంగేశ్వరి, వీవోఏలు కంకాణాల కరుణ, లతలు ఉన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

సిరిసిల్లటౌన్‌: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు డిమాండ్‌ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని జ్యోతిబాపూలే విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నల్ల రిబన్‌ కట్టుకొని వినూత్న రీతిలో మౌన దీక్ష చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అమలు కోసం పార్లమెంట్‌ ఉభయసభల్లో ఏకగ్రీవ తీర్మాణం చేసి ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసి అమలు చేయాలన్నారు. ఇందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు కమలాకర్‌, శ్రీనివాస్‌, ఆంజనేయులు, రాజకుమార్‌, కొండయ్య, రాములుయాదవ్‌, రామాగౌడ్‌, తిరుపతి, రాజు, మల్లేశం, రవి, అనిల్‌ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

జాగిలాలతో    టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు1
1/1

జాగిలాలతో టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement