భవన నిర్మాణాలు వేగంగా పూర్తి చేయండి
● ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ (పీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన పనులు వేగంగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కోరారు. గురువారం కలెక్టరేట్‌లో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 49 అంగన్వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరు అయ్యాయని, పలు భవనాలు పూర్తి కాగా, మిగతావి వివిధ దశల్లో ఉన్నాయన్నారు. గ్రామ పంచాయతీ భవనాలు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలోని 13 కేజీబీవీల్లో మంజూరయిన అదనపు తరగతి గదులు, మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలన్నారు. ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఈవో వినోద్‌కుమార్, పీఆర్ ఈఈ సుదర్శన్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ఎస్.రజిత, జీసీడీవో పద్మజ, డీపీవో షర్ఫుద్దీన్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం పాల్గొన్నారు.
రైతులు ఆందోళన చెందవద్దు
తేమ శాతం వచ్చిన ధాన్యం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు. గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌లో ఐకేపీ, మెప్మా, పీఏసీఎస్ కేంద్రాల నిర్వాహకులతో మాట్లాడారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు తమ పరిధిలోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. జిల్లాలో 37,050 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డివో శేషాద్రి, డీసీఎస్‌వో బి.చంద్రప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
వేగంగా ఇందిరమ్మ ఇళ్ల పనులు
తంగళ్లపల్లి(సిరిసిల్ల): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లిలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో హౌసింగ్ శాఖ నిర్మించిన నమూన ఇందిరమ్మ ఇల్లు, మండెపల్లి, కస్బేకట్కూర్, రాళ్లపేట గ్రామాల్లో 11 ఇందిరమ్మ ఇళ్లను గురువారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే.మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వెలుముల స్వరూపతిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ నేరెళ్ల నర్సింగంగౌడ్, హౌసింగ్ పీడీ శంకర్, డీపీవో షర్ఫుద్ధీన్, తహసీల్దార్ జయంత్‌కుమార్, ఎంపీడీవో కె.లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ జే టోని తదితరులు పాల్గొన్నారు. అలాగే తంగళ్లపల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో నిర్మిస్తున్న తహసీల్ కార్యాలయ భవనాన్ని త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. అనంతరం రాళ్లపేటలోని ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? బోధన, మౌలిక సదుపాయాల తీరుపై ఆమె ఆరా తీశారు.


