రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
వేములవాడ: వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి అన్నారు. గురువారం వేములవాడలో హెవీ వెహికిల్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. నిర్లక్ష్యంగా, కండిషన్ లేని వాహనాలు నడపడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించి చాలామంది తమ ప్రాణాలు కోల్పోయి కుటుంబాలు వీధిన పడుతున్నాయన్నారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు దూర ప్రయాణం చేసే సందర్భాల్లో సరైన విశ్రాంతి తీసుకోవాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తిప్పాపూర్ బస్టాండ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా టిప్పర్‌లో డస్ట్ తరలిస్తున్న వాహనాన్ని సీజ్ చేసినట్లు చెప్పారు. టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైలు రామ్మోహన్, రాజు పాల్గొన్నారు.


