మొలకెత్తిన ధాన్యం
చందుర్తి (వేములవాడ): మోంథా తుఫానుతో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలు అన్నదాత రెక్కల కష్టాన్ని మొలకల పాలు చేసిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. కల్లాల ఏర్పాటులో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో రైతులు ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడే, లేదంటే రోడ్డు వెంట ధాన్యాన్ని ఆరబెట్టుకోవడం ఏళ్ల తరబడి ఆనవాయితీ. చందుర్తి మండలం మర్రిగడ్డ గ్రామంలోని రైతులు పంట చేల్లోనే ధాన్యాన్ని ఆర బోసుకున్నారు. కురిసిన వర్షానికి పంట భూమిలోని తేమ ఆరక అడుగున ఉన్న వరి ధాన్యం మొలకలు వచ్చాయి. క్వింటాళ్ల కొద్ది ధాన్యం మొలకలు రావడంతో రైతులు రెక్కల కష్టం చేతికందకుండా పోయిందని కుమిలి పోతున్నారు.


