ఓపెన్‌ జిమ్స్‌పై నిర్లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ఓపెన్‌ జిమ్స్‌పై నిర్లక్ష్యం

Nov 6 2025 8:30 AM | Updated on Nov 6 2025 8:30 AM

ఓపెన్

ఓపెన్‌ జిమ్స్‌పై నిర్లక్ష్యం

● పరికరాలు విరిగి..పనికిరాకుండా ● పాడుబడుతున్న వైనం ● నిర్వహణ లోపంపై విమర్శలు

ఇది సిరిసిల్ల జిల్లా కేంద్రం శాంతినగర్‌లోని స్మార్ట్‌ ఓపెన్‌ జిమ్‌. రూ.15లక్షలతో ఏడేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. ఈ ప్రాంత ప్రజలు పొద్దున, సాయంత్రం ఇక్కడికి వచ్చి ఆరోగ్య కోసం ఓపెన్‌జిమ్‌లో పరికరాలతో కసరత్తు చేస్తుంటారు. ఏడాది కాలంగా ఈ పరికరాల నిర్వహణను ము న్సిపల్‌ పట్టించుకోవడం లేదు. పరికరాల విడిభాగాలు పాడై పనికిరాకుండా ఉంటున్నాయి. ఇది ఒక్క శాంతినగర్‌లోని ఓపెన్‌ జిమ్‌ పరిస్థితి మాత్రమే కాదు. పట్టణంలో నలువైపులా ఏర్పాటు చేసిన ఆధునిక ఓపెన్‌జిమ్‌ల పరిస్థితి ఇలాగే ఉంది.

● పరికరాలు విరిగి..పనికిరాకుండా ● పాడుబడుతున్న వైనం ● నిర్వహణ లోపంపై విమర్శలు

సిరిసిల్లటౌన్‌: ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యంగా పట్టణ ప్రజల ప్రజారోగ్య రీత్యా ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్స్‌ నిర్వహణ లోపంతో అధ్యానంగా మారాయి. పర్యవేక్షణ కొరవడి పరికరాలు తుప్పుబట్టి పనికిరాకుండా పోతున్నాయి.

ఓపెన్‌జిమ్‌లపై అలక్ష్యం

సిరిసిల్లలో సుమారు ఎనిమిదేళ్ల క్రితం డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌(సీడీఎంఏ) ఆధ్వర్యంలో ‘వరల్డ్‌బ్యాంకు’ ప్రాజెక్టు ద్వారా స్మార్ట్‌ ఓపెన్‌జిమ్స్‌ ఏర్పాటు చేశారు. స్థానిక ఇందిరాపార్కు, శాంతినగర్‌, గణేశ్‌నగర్‌లో ఒక్కోటి రూ.15లక్షలు వెచ్చించి రూ.45లక్షలతో మూడు చోట్ల ఏర్పాటు చేశారు. పట్టణ ప్రజలకు ఆరోగ్యాన్ని అందించే లక్ష్యంగా మున్సిపల్‌ ఆధ్వర్యంలో విలీన గ్రామాలను కూడా కలుపుకుని మొత్తంగా 23 చోట్ల ఏర్పాటు చేసిన ఔట్‌డోర్‌ జిమ్స్‌ ప్రతీరోజు వందలాది సంఖ్యలో పెద్దలు, చిన్నలు, మహిళలు వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. కొన్ని నెలలుగా వీటి పర్యవేక్షణ లోపంతో పరికరాలు తుప్పుబట్టి పోవడం, మరమ్మతుకు నోచుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

నిధులు కోట్లు.. నిర్వహణకు తూట్లు

కోట్లాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన స్మార్ట్‌ జిమ్స్‌ నిర్వహణ లోపంతో ఆరోగ్య సిరిసిల్ల లక్ష్యానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. స్మార్ట్‌ సిరిసిల్లలో ప్రజారోగ్యం కోసం రూ. 1.75కోట్లు ఖర్చు చేయగా.. వాటి నిర్వహణపై శ్రద్ధవహించకపోవడంతో పరికరాలు విరిగిపోవడం, ఫ్లోరింగ్‌ పెచ్చులూడుతున్నాయి. వ్యాయామానికి వచ్చే వారు ఓపెన్‌ జిమ్స్‌ పనికి రాకుండా ఉండటాన్ని అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు జిమ్స్‌ నిర్వహణపై శ్రద్ద పెట్టాలని కోరుతున్నారు.

ఓపెన్‌ జిమ్స్‌పై నిర్లక్ష్యం1
1/1

ఓపెన్‌ జిమ్స్‌పై నిర్లక్ష్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement