బాక్స్‌ క్రికెట్‌ సెంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బాక్స్‌ క్రికెట్‌ సెంటర్‌ ప్రారంభం

Nov 6 2025 8:30 AM | Updated on Nov 6 2025 8:30 AM

బాక్స

బాక్స్‌ క్రికెట్‌ సెంటర్‌ ప్రారంభం

సిరిసిల్లటౌన్‌: క్రికెట్‌ అభిమానుల కోసం సిరిసిల్లలోని కొత్తచెరువు ప్రాంతంలో ఏర్పాటు చేసిన బుధవారం బాక్స్‌ క్రికెట్‌ సెంటర్‌ను ఎస్పీ మహేశ్‌ బీ గీతే ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్‌ ఆడి అలరించారు. సెంటర్‌ యజమానులు బండారి శ్రీనివాస్‌, బండారి విజయ్‌, టౌన్‌ సీఐ కృష్ణ, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్‌, జిల్లా కార్యదర్శి వైద్య శివప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

సర్‌ప్లస్‌ గేట్ల ద్వారా నీటి విడుదల

ఇల్లంతకుంట: ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ ప్రాజెక్టు సర్‌ప్లస్‌ గేట్ల ద్వారా 100 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ప్రాజెక్టులోకి 210 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లోగా క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి వచ్చి చేరుతుందని ఇంజినీరింగ్‌ అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో నీటి సామర్థ్యం 3.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.43 టీఎంసీల నీటి లభ్యత ఉంది.

పత్తి కొనుగోళ్లు నిలిపివేత

ఇల్లంతకుంట: తెలంగాణ కాటన్‌ అసోసియేష న్‌ నిర్ణయం మేరకు గురువారం నుంచి సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు రాజరాజేశ్వర ఆగ్రో ఇండస్ట్రిస్‌, సప్తగిరి శ్రీనివాస్‌ అగ్రో ఇండస్ట్రీస్‌ యాజమాన్యం బుధవారం తెలిపారు. పత్తి ఎకరానికి 12 క్వింటాళ్లకు బదులుగా ఏడు క్వింటాళ్ల పరిమితి విధించడంతో స్లాట్‌ బుకింగ్‌లో రైతులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా కొనుగోళ్లు నిలిపివేస్తున్నామన్నారు. తదుపరి కొనుగోలు తేదీ నిర్ణయించిన తర్వాత పత్తి కొ నుగోలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

రాజన్న అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం

వేములవాడ: రాజరాజేశ్వరస్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (టీఎన్‌జీవో) కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్‌–మాలతి దంపతులు బుధవారం రూ. లక్ష విరాళాన్ని ఆలయ అధికారులు సంజీవ్‌కుమార్‌, ఎడ్ల శివసాయిలకు అందజేశారు. ఈ స ందర్భంగా వారికి స్వామి వారి ప్రత్యేక దర్శనం అవకాశం కల్పించి ప్రసాదాలు అందజేశారు.

షరతుల్లేకుండా ధాన్యం కొనాలి

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బుధవారం సిరిసిల్లలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో వ్యవసాయానికి వాతావరణం అనుకూలంగా లేని పరిస్థితిలో రైతులు ఉన్నారని అన్నారు. వర్షాలతో తడిసి మొలకెత్తిన ధాన్యంతో మొర పెట్టుకుంటున్న రైతుల గోసను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌, వివిధ మండలాల అధ్యక్షులు బూర శేఖర్‌ మిరియాల్‌ కార్‌ బాలాజీ, సౌల్ల క్రాంతి కుమార్‌, రేపాక రామచంద్రం, పరమేశ్‌, మొకిలి విజేందర్‌, కోడె రమేశ్‌, లక్పతి నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

బాక్స్‌ క్రికెట్‌ సెంటర్‌ ప్రారంభం1
1/1

బాక్స్‌ క్రికెట్‌ సెంటర్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement