రమణీయం.. రథోత్సవం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో భగవరాధన, సేవాకాలం, నివేదన, గరుడ వాహనంపై స్వామివారి ఊరేగింపు. సాయంత్రం రథప్రతిష్ట, రథహోమం, రథబలి, నిత్యరాధన, గ్రామ పురవీధుల గుండా స్వామివారిని ఊరేగించారు. మహిళలు మంగళ హారతులతో వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. నాలుగు రోజుల పాటు వైభవంగా నిర్వహించిన మహాజాతరలో చివరి రోజు హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల నుంచి సుమారు 10వేల మంది రథోత్సవం, జాతరకు తరలివచ్చారు. సీఐ శ్రీనివాస్‌గౌడ్, ఎస్సై రాహుల్‌రెడ్డిల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
రమణీయం.. రథోత్సవం


