సీజేపై దాడి అమానుషం
సిరిసిల్లటౌన్: సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌పై దాడి అమానుషమని ఎంఎస్‌పీ జిల్లా ఇన్‌చార్జి పుట్ట రవి పేర్కొన్నారు. సిరిసిల్లలోని అంబేడ్కర్‌చౌరస్తాలో సోమవారం ఎంఎస్‌పీ, వీహెచ్‌పీఎస్, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ యెలగంధుల భిక్షపతి మాట్లాడుతూ సీజేపై దాడిని నిరసిస్తూ నవంబర్ 1న హైదరాబాద్‌లో నిర్వహించే దళితుల ఆత్మగౌరవ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఆవునూరి ప్రభాకర్, ఖానాపురం లక్ష్మణ్, సావనపెల్లి రాకేశ్, సడిమెల శోభారాణి, గుండ్రేడ్డి రాజు, బడుగు లింగయ్య, సావనపెల్లి బాలయ్య, సోమారపు శరవింద్, కొమ్ము రాజశేఖర్, గద్దరాశి భగవంత్, దయ్యాల నారాయణ, నరేశ్‌వర్మ, ప్రశాంత్, అందె సామియేలు పాల్గొన్నారు.


