నాణ్యమైన భోజనం పెట్టాలి
● మంచిగా చదివి ఉన్నత స్థానాలకు ఎదగాలి ● ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ ● తంగళ్లపల్లి కేజీబీవీ తనిఖీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం పెట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం పద్మనగర్ కేజీబీవీని సోమవారం తనిఖీ చేశారు. స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు. కోడిగుడ్లపై స్టాంప్ ఉండేలా చూసుకోవాలన్నారు. విద్యార్థులతోపాటు కింద కూర్చుని వారి భవిష్యత్ ప్రణాళికపై అవగాహన కల్పించారు. చదువుపై శ్రద్ధ పెట్టాలని, ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. కేజీబీవీ స్పెషల్ అధికారి శ్యామల తదితరులు పాల్గొన్నారు.
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్ల పీహెచ్‌సీని తనిఖీ చేశారు. రక్తపరీక్షల ల్యాబ్, మందుల గది, వ్యాక్సిన్లు, మందులు పరిశీలించారు.
ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వేగం పెంచాలి
వేములవాడ: రాజన్న ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వేగం పెంచాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ సూచించారు. ఆలయ పనులు సోమవారం పరిశీలించి పలు సూచనలు చేశారు. బద్దిపోచమ్మ ఆలయ పనులపై ఆరా తీశారు. పనుల వివరాలను ఈవో రమాదేవి, ఆర్‌అండ్‌బీ అధికారులు వివరించారు. గుడిచెరువు ట్యాంక్‌బండ్ పనులను పరిశీలించారు. ఆర్డీవో రాధాబాయి, ట్రెయినీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత, ఆర్‌అండ్‌బీ ఈఈ నరసింహాచారి, వీటీడీఏ సీపీవో అన్సారీ, నీటి పారుదలశాఖ ఈఈ కిశోర్, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, పర్యాటక సంస్థ ఎస్‌ఈ సరిత ఉన్నారు.
రైతులకు అందుబాటులో ఉండాలి


