ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం

Oct 28 2025 7:40 AM | Updated on Oct 28 2025 7:40 AM

ప్రసా

ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం

● డీసీవోకు ఫిర్యాదు పనుల్లో వేగం పెంచండి ● ఆలయ ఈవో రమాదేవి కార్మికులకు పదోన్నతులు ఇవ్వాలి

వేములవాడ: భీమేశ్వరాలయంలో దర్శించుకునే భక్తుల కోసం వేదపాటశాలలోని ప్రసాదాల కౌంటర్‌ను సోమవారం అధికారులు ప్రారంభించారు. భక్తుల సౌకర్యార్థం కొన్ని కౌంటర్లను ప్రారంభించారు. పనులు పూర్తికాగానే మిగతా కౌంటర్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో రాజన్న ఆలయంలో పనులు జరుగుతుండడంతో భక్తులు అటు రాజన్నను, ఇటు భీమన్నను దర్శించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం రద్దీ ఎక్కువగా ఉండడం, ఎండ తీవ్రత కూడా ఉండడంతో అధికారులు రాజన్న ప్రధానాలయం ఎదుట టెంట్‌ వేయించారు.

అక్రమాలపై విచారణ చేపట్టండి

సిరిసిల్ల: ఇల్లంతకుంట వ్యవసాయ సహకార సంఘం(సింగి ల్‌విండో)లో జరిగిన అక్రమాలపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకో వాలని కోరుతూ జిల్లా సహకార అధికారికి సో మవారం ఫిర్యాదు చేశారు. 2021 ఖరీఫ్‌ నుంచి 2024 వరకు ధాన్యం కొనుగోళ్లలో రూ.95 లక్షల మేర అక్రమాలు జరిగాయని డీసీవోకు ఫిర్యాదు చేశారు. పాలకవర్గం సభ్యులు చల్ల నవీన్‌రెడ్డి, గన్నెరం వసంత నర్సయ్య, పాలకవర్గ మాజీ సభ్యుడు నవీన్‌కుమార్‌ ఉన్నారు.

వేములవాడ: భీమేశ్వరాలయంలో భక్తుల సౌకర్యాల కోసం జరుగుతున్న పనుల్లో వేగం పెంచాలని ఆలయ ఈవో రమాదేవి అధికారులను ఆదేశించారు. భీమన్నగుడిలో జరుగుతున్న క్యూలైన్లు, షెడ్ల నిర్మాణం, సీసీ ఫ్లోరింగ్‌ పనులను సోమవారం పరిశీలించారు. డీఈ రఘునందన్‌, ఏఈవో శ్రవణ్‌కుమార్‌ ఉన్నారు.

సిరిసిల్లటౌన్‌: కోఆపరేటీవ్‌ సొసైటీ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు, ఉద్యోగులకు వెంటనే పదోన్నతులు కల్పించాలని తెలంగాణ స్టేట్‌ యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కె.ఈశ్వర్‌రావు కోరారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కారుణ్య నియామకాలు రెగ్యులరైజ్‌ చేయాలని, ఒకే కేడర్‌లో 6, 12, 16, 24 ఏళ్లు సేవలు పూర్తి చేసిన ఉద్యోగులకు మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని కోరారు. లీవ్‌ ఎన్‌క్యాష్‌ మెంట్‌ విధానాన్ని అమలు చేయాలని, గతంలో సెస్‌ పరిధిలో చెల్లించిన ఎఫ్‌టీఏను పునరుద్ధరించాలని కోరారు. ఇంక్రిమెంట్‌, డీఏ, ఇత ర బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చే శారు. యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి న లువాల స్వామి, నాయకులు ఎగమంటి ఎల్లారెడ్డి, మల్లేశ్‌, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాస్‌, సత్త య్య, అనిల్‌, కిషన్‌, రాంబాబు పాల్గొన్నారు.

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

వేములవాడరూరల్‌: నాలుగు నెలలుగా పెండింగ్‌లో ఉన్న ఫీల్డ్‌ అసిస్టెంట్లకు అందించాల్సిన వేతనాలను వెంటనే చెల్లించాలని ఐఎన్‌టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవునూరి వెంకటేశ్‌ కోరారు. సోమవారం ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమావేశం నిర్వహించారు. వెంకటేశ్‌ మాట్లాడుతూ మేనిఫెస్టోలో సూచించిన విధంగా ఫీల్డ్‌ అసిస్టెంట్లకు ఫీల్డ్‌ పేస్కేల్‌ ఇప్పించా లని కోరారు. దూలపల్లి బానయ్య, పారేలి రమణ, నారాయణ, బైరగోని శ్రీనివాస్‌, రఘునందన్‌, కొమ్ము రమేశ్‌, చంద్రగిరి నవీన్‌, యేసు రత్నం, మల్లేశం పాల్గొన్నారు.

ప్రసాదాల కౌంటర్‌   ప్రారంభం1
1/4

ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం

ప్రసాదాల కౌంటర్‌   ప్రారంభం2
2/4

ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం

ప్రసాదాల కౌంటర్‌   ప్రారంభం3
3/4

ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం

ప్రసాదాల కౌంటర్‌   ప్రారంభం4
4/4

ప్రసాదాల కౌంటర్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement