పోలీసుల త్యాగాలు స్మరించుకోవాలి
సిరిసిల్ల: పౌర సమాజ రక్షణ కోసం త్యాగాలు చేసిన పోలీసులను స్మరించుకోవాలని ఏఎస్పీ చంద్రయ్య పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా సోమవారం సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీ చంద్రయ్య మాట్లాడుతూ.. పోలీస్‌శాఖ, ప్రజల మధ్య సత్సంబంధాలను బలోపేతం చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు రేయింబవళ్లు పనిచేస్తారన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం వారి కుటుంబాలకు తీరని లోటు అని పేర్కొన్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మధుకర్, ఆర్‌ఐలు మధుకర్, రమేశ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


