సిరిసిల్లకల్చరల్/వేములవాడ: సిరిసిల్లకు చెందిన న్యాయవాది మారుతిపై జరిగిన దాడిపై జిల్లాలోని న్యాయవాదులు గురువారం నిరసన తెలిపారు. సిరిసిల్ల, వేములాడ కోర్టుల్లోని అడ్వకేట్లు విధులు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ న్యాయవాదులపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు. సిరిసిల్లలో తంగళ్లపల్లి వెంకటి మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, అడ్వకేట్లు కోడం సత్యనారాయణ, రవీందర్‌రావు, సబ్బని రవీందర్, దోర్నాల సంజీవ్‌రెడ్డి, ధర్మేందర్, వసంతం, కోడం సురేశ్, నాగుల సత్యనారాయణ, నేరెళ్ల తిరుమల్‌గౌడ్, పిట్టల మనోహర్, కట్కం జనార్దన్, రేగుల దేవేందర్, దివాకర్, అన్నపూర్ణ, సుజాత, పద్మ, నయీమానాసరి తదితరులు పాల్గొన్నారు.


