జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి
● కలెక్టర్ గరిమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాను అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిపేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ కోరారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలన్నా రు. ప్రభుత్వ విద్యాలయాల్లో మెనూ ప్రకారం భోజ నం పెట్టాలని సూచించారు. ప్రజావాణికి అన్ని శాఖల అధికారులు సమయానికి హాజరుకావాలని ఆదేశించారు.
అదనపు కలెక్టర్‌గా..
జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్‌గా ఉన్న గరిమా అగ్రవాల్‌ను జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఆదేశాలు జారీచేసింది. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌కు రాగా.. అదనపు కలెక్టర్(రెవెన్యూ) నగేశ్ పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు.
వెంటనే ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు
కలెక్టర్ ఎం.హరిత సెలవుపై వెళ్లగా, ఇన్‌చార్జి కలెక్టర్‌గా గరిమా అగ్రవాల్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్ ఏవో రామ్‌రెడ్డి పాల్గొన్నారు.
రాజన్న సేవలో ఇన్‌చార్జి కలెక్టర్
వేములవాడ: రాజన్నను ఇన్‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఏఈవో బ్రహ్మన్నగారి శ్రీనివాస్ అమ్మవారి శేషవస్త్రాలు, లడ్డూ ప్రసాదం అందజేశారు. తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, ఆలయ అధికారులు ఉన్నారు.


