స్థలాలు చూపించండి
● బెల్లం, కొబ్బరికాయ వ్యాపారుల వేడుకోలు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనుల్లో భాగంగా గురువారం పలు దుకాణాలు ఉన్న భవనాలను కూల్చివేశారు. దీంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారు. రెండేళ్ల కోసం కాంట్రాక్టు తీసుకున్న తమ షాపులను హఠాత్తుగా కూల్చివేస్తే రోడ్డుపైన పడతామని వ్యాపారులు వాపోయారు. బెల్లం దుకాణం, కోడెలకు పచ్చిగడ్డి, పూలు, పత్రి, అరటిపండ్ల దుకాణాలను ధర్మగుండం పక్కన వరండాలోకి మార్చడం ద్వారా వ్యాపారాలు దెబ్బతింటున్నాయని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భీమన్నగుడి వద్ద దర్శనాలు కొనసాగుతుండడం వల్ల ఎక్కువ సంఖ్యలో భక్తులు అక్కడికే వస్తున్నారని.. తమకు కూడా అక్కడే స్థలాలు చూపించాలని వ్యాపారులు వేడుకుంటున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌ను సైతం కలిసి తమ గోడు విన్నవించుకున్నట్లు వారు తెలిపారు. ఆలయ విస్తరణ, భీమన్న గుడిలో దర్శనాల ఏర్పాట్లలో బిజీగా ఉండటంతో కాంట్రాక్టర్ల అంశం కొలిక్కి రావడంలేదని సదరు శాఖ అధికారులు పేర్కొంటున్నారు.


