
అంబులెన్స్ సేవల్లో నిర్లక్ష్యం వద్దు
● ప్రోగ్రామ్ ఆఫీసర్ జనార్దన్
సిరిసిల్లటౌన్/ముస్తాబాద్: అత్యవసర సమయాల్లో ముందుండే 108 అంబులెన్స్ సేవలపై నిర్లక్ష్యం ఉండొద్దని ప్రోగ్రాం ఆఫీసర్ జనార్దన్ హెచ్చరించారు. జిల్లాలోని 108 అత్యవసర అంబులెన్స్ వాహనాలను జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్‌తో కలిసి బుధవారం తనిఖీ చేపట్టారు. జిల్లా కేంద్రంతోపాటు ముస్తాబాద్‌లోని అంబులెన్స్ వాహనాలను పరీక్షించారు. ఆక్సిజన్ నిల్వలు, వెంటిలేటర్, మానిటర్, అంబు బ్యాగ్, సక్షన్ ఆపరేటర్, పల్స్ ఆక్సిమీటర్, గ్లూకోమీటర్, ఇంక్యుబేటర్ పనితీరును పరిశీలించారు. 108 సిబ్బంది పెద్ది శ్రీనివాస్, బుర్ర స్వాతి, నునావత్ మదన్, బత్తుల రాజు, మొగిలి సుధాకర్, పొలబోయిన గణేశ్, మినుప స్వామి, పోచంపల్లి పరశురాములు, అరుణ్, కిషన్, ప్రశాంత్ ఉన్నారు.