
అదనపు కలెక్టర్‌గా గరీమా అగర్వాల్
సిరిసిల్ల: జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గరీమా అగర్వాల్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సిద్దిపేట జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా పనిచేస్తున్న గరీమాను రాజన్నసిరిసిల్ల జిల్లాకు బదిలీ చేస్తూ జీవో ఆర్‌టీ నంబరు 1472 తేదీ: 22.10.2025ను జారీ చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన గరీమా అగర్వాల్ 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారిణి. జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా గతంలో గౌతమి పూజార పని చేశారు. ఆమె బదిలీ తరువాత ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న అదనపు కలెక్టర్ పోస్టులోకి గరీమా అగర్వాల్ వస్తున్నారు.