
వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం
● విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి లక్ష్మణ్‌రావు
వేములవాడ: వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్‌ఎస్‌ఎస్ లక్ష్యమని విద్యాభారతి దక్షిణమధ్య క్షేత్ర కార్యదర్శి అయాచితుల లక్ష్మణరావు పేర్కొన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వందేళ్ల స్థాపన ఉత్సవాల్లో భాగంగా వేములవాడ ఖండ ఆధ్వర్యంలో గురువారం విజయదశమి ఉత్సవం జరిగింది. హిందువులలో ఐక్యతను పెంపొందిస్తుందన్నారు. హిందూత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమని పేర్కొన్నారు. డాక్టర్ కె.మనోహర్, కొండం పుల్లారెడ్డి, గ్రామాల స్వయం సేవకులు పాల్గొన్నారు.