దీపావళికి గృహ ప్రవేశాలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

దీపావళికి గృహ ప్రవేశాలు చేయాలి

Sep 26 2025 6:32 AM | Updated on Sep 26 2025 6:32 AM

దీపావళికి గృహ ప్రవేశాలు చేయాలి

దీపావళికి గృహ ప్రవేశాలు చేయాలి

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

● కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా

సిరిసిల్ల/చందుర్తి(వేములవాడ): దీపావళి పండుగ వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని, గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉండాలని లబ్ధిదారులను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. చందుర్తి మండలం కట్టలింగంపేటలోని పల్లికొండ మౌని క, మారుపాక నర్సవ్వ, కొంక సృజన, చందుర్తిలోని పోంశెట్టి లక్ష్మిల ఇళ్లను గురువారం పరిశీలించారు. ఇసుక రవాణా చేసే ట్రాక్టర్‌ యాజమానులు కూలీ ల ఖర్చులు మినహాయించి ట్రిప్పునకు రూ.1500 కన్న ఎక్కువ వసూలు చేస్తే తమ దృష్టికి తేవాలన్నారు. గృహ నిర్మాణ సంస్థ అధికారులు ఎప్పటికప్పుడు ఫొటోలు ఆన్‌లైన్‌ చేసి బిల్లులు త్వరగా అందలే చూడాలని సూచించారు. హౌసింగ్‌ శాఖ పీడీ శంకర్‌రెడ్డి, ఏఈ రాజమోహన్‌ ఉన్నారు.

మాన్యువల్‌ స్కావెంజర్‌ విముక్తి జిల్లాపై అభ్యంతరాల ఆహ్వానం

మాన్యువల్‌ స్కావెంజర్‌ విముక్తి జిల్లాగా ప్రకటించేందుకు అభ్యంతరాలుంటే ఐదు రోజుల్లో తెలపాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా కోరారు. జిల్లా స్థాయి కమిటీ జిల్లలోని 260 గ్రామాలు, సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో సర్వే చేసి మాన్యువల్‌ స్కావెంజర్లను గుర్తించలేదని పేర్కొన్నారు. ఆ కమిటీ నివేదిక ప్రకారం మాన్యువల్‌ స్కావెంజర్‌ విముక్తి జిల్లాగా ప్రకటించాలని సిపార్సు చేసిందన్నారు. అభ్యంతరాలుంటే జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఆఫీస్‌లో ఐదు రోజు ల్లో తెలపాలని కోరారు. అభ్యంతరాలు రాకుంటే అపరిశుభ్రమైన మరుగుదొడ్ల నుంచి విముక్తి పొందిన జిల్లాగా అధికారికంగా ప్రకటిస్తామని స్పష్టం చేశారు.

మద్యం షాప్‌లకు డ్రా పద్ధతిలో రిజర్వేషన్లు

జిల్లాలో 2025–2027 సంవత్సరానికి మద్యం షాపులకు రిజర్వేషన్లు డ్రా పద్ధతిలో ఖరారు చేసినట్లు కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా వెల్లడించారు. నూతన మద్యం దుకాణాల రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టరేట్‌లో డ్రా తీశారు. 48 దుకాణాలకు గౌడ్లకు 9, ఎస్సీలకు 5 కేటాయించినట్లు తెలిపారు. ఎస్సీలకు 14, 28, 34, 40, 43 నంబర్ల దుకాణాలు, గౌడ్లకు 02, 15, 17, 18, 33, 36, 38, 46, 48 నంబర్ల దుకాణాలు వచ్చినట్లు తెలిపారు. జిల్లా ఎకై ్సజ్‌ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్‌రెడ్డి, బీసీ సంక్షేమశాఖ అధికారి సౌజన్య, ఆబ్కారీ సీఐలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement