సిరిసిల్ల/తంగళ్లపల్లి(సిరిసిల్ల): పోరుబాట పట్టిన ఊరిబిడ్డ అమరుడయ్యాడని గోపాల్‌రావుపల్లె ఘొల్లుమంది. నవయవ్వనంలో అడవిబాట పట్టిన యువకుడు 70 ఏళ్ల వయసులో నమ్మినబాటలోనే ప్రాణాలు విడిచాడని ఊరు, వాడ కన్నీటిపర్యంతమైంది. ఇన్నాళ్లు ఎక్కడ ఎన్‌కౌంటర్ జరిగినా తమ ఊరి పిలగాడు ఉన్నాడేమోనని ఆతృతగా వార్తలు విన్న ఆ గ్రామస్తులు నేడు విగతజీవిగా చూసి గుండెలవిసేలా రోదించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కొస అలియాస్ సాధు అంత్యక్రియలు స్వగ్రామం తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావుపల్లెలో గురువారం కుటుంబ సభ్యులు, పౌరహక్కుల నేతలు, బంధువులు, స్నేహితుల అశ్రునయనాల మధ్య పూర్తయ్యాయి. – వివరాలు 10లో..