
ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలోని వాసవి ఆర్యవైశ్య అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రాజశ్యామల దేవి కుంకుమ పూజ, పల్లకీసేవలో పాల్గొన్నారు.
వేములవాడరూరల్: వేములవాడరూరల్, వేములవాడ అర్బన్, చందుర్తి, బోయినపల్లి మండలాల ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో గురువారం డీఆర్‌డీవో ఏర్పాటు చేసిన సమావేశాన్ని ఫీల్డ్ అసిస్టెంట్లు బహిష్కరించారు. వారు మాట్లాడుతూ తమకు మూడు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదన్నారు. జీతాలు రాక తమ జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ, దసరా పండుగకు జీతం రాక కుటుంబాన్ని పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ డీఆర్‌డీవోకు వినతిపత్రం అందజేశారు.
సిరిసిల్లటౌన్: దీన్‌దయాల్ జయంతి వేడుకలను సిరిసిల్లలోని బీజేపీ ఆఫీస్‌లో గురువారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జీవితం అందరికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్రం మహేశ్, రాష్ట్ర నాయకులు లింగంపల్లి శంకర్, మ్యాన రాంప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షుడు శీలం రాజు, ఉపాధ్యక్షురాలు శ్రీమతి బర్కం లక్ష్మి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బర్కం నవీన్, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, రేగుల సంతోశ్‌బాబు పాల్గొన్నారు.
సిరిసిల్లటౌన్: స్వచ్ఛత హీ సేవాలో భాగంగా సిరిసిల్ల మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం ‘ఏక్ దిన్–ఏక్ గంట–ఏక్ సాథ్–శ్రమదాన్’ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో కొత్తచెరువు బండ్, పరిసర ప్రాంతాల్లో చెత్త, ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించారు. కమిషనర్ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు. తడి, పొడి చెత్తగా వేరు చేసి మున్సిపాలిటీ వాహనానికి ఇవ్వాలని సూచించారు. స్వచ్ఛత హీ సేవాలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రం చేసేందుకు కనీసం గంట సమయం కేటాయించాలని కోరారు.
రుద్రంగి(వేములవాడ): స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీని గురువారం ఇంటర్మీడియట్ బోర్డ్ అబ్జర్వర్ రమణారావు, జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వై.శ్రీనివాస్ గురువారం పర్యవేక్షించారు. శుక్రవారం జరిగే మెగా పేరెంట్, టీచర్ మీటింగ్‌కు సంబంధించి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావాలని కోరారు. కళాశాల ప్రిన్సిపాల్ భార్గవిదేవి తదితరులు పాల్గొన్నారు.

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత

ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత