
దుర్గామాతకు బోనం మొక్కులు
చందుర్తి(వేములవాడ): మండల కేంద్రంలోని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాతకు గురువారం భక్తులు బోనం మొక్కులు చెల్లించుకున్నారు. డప్పుచప్పుళ్లు.. పోతరాజుల విన్యసాల మధ్య బోనాలతో మహిళలు తరలివచ్చారు. బీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు, సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాస్‌రావు, సింగిల్‌విండో అధ్యక్షుడు తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగి మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఏనుగు శ్రీనివాస్, మార్త గంగాధర్, సిరికొండ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.