
పోరులో ‘జోగినిపల్లి’ యోధులు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ సాయుధ పోరులో బోయినపల్లి మండలం కొదురుపాక గ్రామానికి చెందిన జోగినిపల్లి కేశవరావు, మాన్వాడ గ్రామానికి చెందిన జోగినిపల్లి ఆనందరావు అలుపెరుగని పోరాటాలు చేశారు. 1920లో జన్మించిన కేశవరావు వ్యవసాయంతో పాటు సోషల్ వర్క్ చేసేవారు. 1940లో మహారాష్ట్ర చాందా, నాగ్‌పూర్ నుంచి ఆయుధాలు సేకరించి ఇక్కడ సాయుద దళాలకు అందించేవారని పూర్వికులు చెబుతారు. మూడుసార్లు పట్టుబడి వరంగల్ జైలుజీవితం గడిపారు. కేశవరావుకు భార్య లక్ష్మికాంతమ్మ, కుమారుడు శ్రీనివాసరావు, కూతుర్లు శోభమ్మ, శశికళ, స్వర్నలత ఉన్నారు. పెద్ద కుమార్తె శోభమ్మతో మాజీ సీఎం కేసీఆర్ వివాహం జరిగింది. 2000 సంవత్సరంలో కేశవరావు కాలం చేశారు.
ఆనందరావు స్మారక స్తూపం
మాన్వాడకు చెందిన ఆనందరావు 1921లో జన్మించారు. బీఏ, ఎల్‌ఎల్‌బీ చేశారు. చెన్నమనేని రాజేశ్వరరావుకు మేనమామ అయిన ఆనందరావు సిరిసిల్ల ప్రాంతంలో జరిగిన సాయుధ పోరులో కీలక పాత్ర పోశించారు. 1952–1957 వరకు సిరిసిల్ల ఎమ్మెల్యేగా, 1957–1962 వరకు మెట్‌పల్లి ఎమ్మెల్యేగా పని చేశారు. 2009లో ఆయన కాలం చేశారు. ఆనందరావు పోరాటాలకు గుర్తింపుగా మాన్వాడలో 2015లో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు.
కేశవరావు (ఫైల్)
ఆనందరావు (ఫైల్)

పోరులో ‘జోగినిపల్లి’ యోధులు