
యూరియా కోసం..
గాలిపెల్లి మహిళా సంఘం ఎదుట యూరియా కోసం బారులు తీరిన రైతులు
ఇల్లంతకుంట(మానకొండూర్): యూరియా కోసం రైతుల కష్టాలు అన్నీ..ఇన్నీ కావు. ఇల్లంతకుంట మండలం గాలిపెల్లిలోని ఆదర్శ మహిళా సంఘానికి 330 యూరియా బస్తాలు కేటాయించగా ఆదివారం భారీ సంఖ్యలో రైతులు క్యూ కట్టారు. యూరియా కోసం గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నారు. గాలిపెల్లిలో మ్యాక్స్, ప్రైవేట్ ఫర్టిలైజర్‌షాపు, మహిళా సంఘాలలో కలిపి 770 బస్తాలు, కందికట్కూర్‌లో అవని మహిళా సంఘంలో 225 బస్తాలు పంపిణీ చేసినట్లు వ్యవసాయాధికారి సురేష్‌రెడ్డి తెలిపారు.