
మెరుగైన వైద్యసేవలు అందించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● జిల్లా ఆస్పత్రి తనిఖీ ● గండిలచ్చపేటలో జ్వరాల సర్వే చేయాలని ఆదేశాలు
సిరిసిల్ల: ప్రభుత్వ ఆస్పత్రిలో చేరే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వైద్యులకు సూచించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆస్పత్రిని ఆదివారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎమర్జెన్సీ, ఐసీయూ, మెటర్నిటీ, ఆర్థోపెడిక్ వార్డుల్లో అందిస్తున్న వైద్యసేవలు పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు రోగులతో మాట్లాడి వైద్యసేవలు అందుతున్న తీరును తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు పొంచి ఉన్న నేపథ్యంలో ప్రతి రోగికి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో ఫీవర్ సర్వే చేయాలని జిల్లా వైద్యాధికారి రజితను ఆదేశించారు.