
ఉత్సాహంగా క్రీడాపోటీలు
బాక్సింగ్‌లో తలపడుతున్న విద్యార్థినులు
కోనరావుపేట(వేములవాడ): మరిమడ్లలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో ఐదో రాష్ట్రస్థాయి బాలికల క్రీడాపోటీలు రెండో రోజు ఆదివారం ఉత్సాహంగా కొనసాగాయి. రాష్ట్రంలోని 23 ఈఎంఆర్‌ఎస్‌ల నుంచి వచ్చిన 1130 మంది విద్యార్థినులు క్రీడాపోటీల్లో పాల్గొంటున్నారు. బాడ్మింటన్, రెజ్లింగ్, తైక్వాండో, జూడో, బాక్సింగ్, యోగా, అథ్లెటిక్స్, లాంగ్‌జంప్, హైజంప్, షాట్‌పుట్, ఆర్చరీ, బాస్కెట్‌బాల్, హ్యాండ్‌బాల్, వాలీబాల్, హాకీ పోటీల్లో విద్యార్థినులు పాల్గొంటున్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన 300 మంది విద్యార్థినులను జాతీయస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ప్రిన్సిపాల్ రామ్ సూరత్‌యాదవ్ తెలిపారు. వీరు అక్టోబర్‌లో ఒడిశాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు.