
సమస్యలు పరిష్కరించాలి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు కలెక్టరేట్ బాట పట్టారు. కాలినడకన తరలివెళ/్ల సమస్యలు విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగేళ్ల క్రితం ఏర్పాటు చేసిన జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో అడ్మిషన్లు తీసుకునేటప్పుడు ఆరు నెలల తర్వాత అత్యాధునిక వసతులతో కూడిన కళాశాల భవనాన్ని నిర్మిస్తామని చెప్పారని అన్నారు. ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేపట్టకపోవడంతో అటు డిగ్రీ కళాశాల, ఇటు ఇంజినీరింగ్ కళాశాలలో గదులు సరిపోక ఇబ్బందిగా మారిందని తెలిపారు. అధ్యాపకులు ఇద్దరు మాత్రమే గవర్నమెంట్, మిగతా వారు కాంట్రాక్ట్, గెస్ట్ ప్యాకల్టీ వారు బోధన చేస్తున్నారన్నారు. ఇప్పటికై న కళాశాలో వసతి కల్పించాలని కోరారు.