
గంగమ్మ ఒడికి గణపయ్య
వేములవాడ: నవరాత్రులు ఘనంగా పూజలందుకున్న గణనాఽథుడిని వేములవాడ ప్రజలు గురువారం భక్తిభావంతో నిమజ్జనం చేశారు. ఊరేగింపుగా తరలివెళ్లి రాజన్న గుడి చెరువులో వినాయకుల నిమజ్జనం పూర్తి చేశారు. నిత్యం పూజలు, అన్నదానాలు నిర్వహించిన భక్తులు గణనాథులను అందంగా అలంకరించిన వాహనాలపై ఉంచి ర్యాలీగా తీసుకెళ్లారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కమిషనర్ అన్వేశ్ తమ సిబ్బందితో సకల ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎస్పీ మహేశ్ బి గీతే, ఆర్డీవో రాధాభాయి ఏర్పాట్లను పరిశీలించారు.
రాజన్న గుడి ఎదుట వినాయకుల ర్యాలీ
డోలు వాయిస్తున్న విప్ శ్రీనివాస్, ప్రతాప రామకృష్ణ
బోట్‌పై నుంచి పర్యవేక్షిస్తున్న కలెక్టర్, ఎస్పీ, విప్