
యూరియా కోసం అన్నదాతల ఆందోళన
ఒక్కో బస్తా ఇవ్వడంపై ఆగ్రహం
వీర్నపల్లి, మరిమడ్లలో రోడ్డెక్కిన రైతులు
మరిమడ్లలో బైఠాయించిన రైతులు
వీర్నపల్లిలో ఆందోళన చేస్తున్న అన్నదాతలు
కోనరావుపేట/వీర్నపల్లి: యూరియా కోసం రైతులు జిల్లా వ్యాప్తంగా గురువారం ఆందోళన చేపట్టారు. సరిపోయేంత బస్తాలు రావడం లేదని రోడ్డెక్కారు. కోనరావుపేట మండలం మరిమడ్ల రైతులు ధర్నాకు దిగగా వ్యవసాయాధికారి సందీప్ వచ్చి వారితో మాట్లాడారు. యూరియా వచ్చేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మరిమడ్లలో మాజీ సర్పంచ్ మాట్ల అశోక్, లక్కం భాస్కర్, నారాయణ, రమేశ్, రాజు, శ్రీనివాస్, వేణు పాల్గొన్నారు. వీర్నపల్లి మండల కేంద్రానికి 300 బస్తాలు రావడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. ప్రజాసంఘాల నాయకుడు మల్లారపు అరుణ్‌కుమార్ మాట్లాడుతూ పది రోజులుగా పడిగాపులు కాస్తే లారీ సగం లోడ్ తీసుకొచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని తహసీల్దార్ ముక్తార్‌పాషా, ఏఎంసీ చైర్మన్ రాములు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

యూరియా కోసం అన్నదాతల ఆందోళన