
నిరంతరం వైద్యం అందిస్తున్నాం
ఆస్పత్రిలో ఫ్లూయిడ్స్, ఇంజక్షన్లు, ఓఆర్‌ఎస్‌లు, యాంటి బయాటిక్స్ అందుబాటులో ఉన్నాయి. వెంటిలేటర్, ఆక్సిజన్ సౌకర్యం ఉంది. ఐసీయూలో పది పడకలు కేటాయించాం. ప్రె వేటు కన్నా మెరుగ్గా వైద్యం అందిస్తున్నాం. చాలా మంది ఇతర జ్వరాలతో కూడా వస్తున్నారు. డెంగీ, వైరల్ ఫీవర్స్ అయినా సరే ఉచితంగా టెస్టులు, వైద్యం అందిస్తున్నాం. నెల రోజుల నుంచి 70 మంది రోగులు జ్వరాలతో ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్ అయ్యారు. వీరిలో 20 మందికి డెంగీ పాజిటివ్ వచ్చింది. చికిత్స అందించగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
– డాక్టర్ బి.ప్రవీణ్ కుమార్,
జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్
ఈఏడాదిలో ఇప్పటి వరకు వరకు 15,408 వైరల్, ఇతర ఫీవర్స్ నమోదయ్యాయి. మొత్తంగా 8,796 డెంగీ టెస్టులు చేయగా జిల్లా వ్యాప్తంగా 30 పాజిటివ్ వచ్చాయి. వారంతా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. డెంగీ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తున్నాం. ర్యాపిడ్ టెస్టుల్లో డెంగీ పాజిటివ్ వస్తే టీహబ్‌లో ఎలీజా ఎన్‌ఎస్–1 టెస్టు చేసి నిర్ధారిస్తాం.
– డాక్టర్ రజిత, డీఎంహెచ్‌వో

నిరంతరం వైద్యం అందిస్తున్నాం