
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి
సిరిసిల్లఅర్బన్: ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడం సరికాదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గుండెల్లి కల్యాణ్‌కుమార్, ఉపాధ్యక్షుడు జూపల్లి మనోజ్‌కుమార్, గర్‌ల్స్ కన్వీనర్ సంజన, జిల్లా కమిటీ సభ్యులు సాయిభరత్, శివ పాల్గొన్నారు.