
జోహార్ వైఎస్సార్
వేములవాడఅర్బన్: వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్ తెలంగాణ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి వర్ధంతి నిర్వహించారు. వైఎస్సార్ చిత్రపటానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పూలమాల వేసి నివాళి అర్పించారు. విప్ మాట్లాడుతూ వైఎస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చేసిన సేవలు మరవలేనివన్నారు. పార్టీ పట్టణాధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ కనికరపు రాకేశ్, సాగరం వెంకటస్వామి, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.