
అర్జీలు పరిష్కరించాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ● ప్రజావాణిలో 126 దరఖాస్తుల స్వీకరణ
సిరిసిల్ల అర్బన్: ప్రజావాణి అర్జీలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి రెవెన్యూ అధికారి గడ్డం నగేశ్, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, జెడ్పీ సీఈవో వినోద్‌కుమార్, డీఆర్డీవో శేషాద్రిలతో కలిసి అర్జీలు స్వీకరించారు. మొత్తం 126 దరఖాస్తులు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని, ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.