
వర్షం పడితే వరదలే..
కొన్నాళ్ల నుంచి వర్షం పడితే చాలు ఆటోనగర్ ప్రధాన రోడ్డు వెంట వరదనీరు వస్తుంది. గతంలో ఇలాంటి పరిస్థితి లేదు. కొత్తచెరువు తదితర చెరువుల నాలాలు కబ్జాకావడంతో వాటి గుండా వాగులోకి చేరాల్సిన నీరు మా ప్రాంతాన్ని ముంపునకు గురిచేస్తుంది. శాశ్వత వరదకాల్వ నిర్మిస్తేనే సమస్య పరిష్కారమవుతుంది.
– వేముల శ్రీనివాస్, ఆటోనగర్
పాతబస్టాండు ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షం నీరు నిలువడలేదు. ఇప్పటికే ఆ ప్రాంతంలో డ్రైనేజీలో చెత్త నిలువకుండా చేశాం. వర్షాకాలంలో సిబ్బందిని నిరంతరం పర్యవేక్షణలో ఉంచుతున్నాం. కొత్తచెరువు నాలా, సంజీవయ్యనగర్ కమాన్ వద్ద డ్రైనేజీల నిర్మాణానికి ప్రణాళికలు పూర్తయ్యాయి. అనుమతులు రాగానే పూర్తి చేస్తాం. నాలాలు, ప్రధాన డ్రైనేజీల వద్ద హెచ్చరికబోర్డులు ఏర్పాటు చేశాం.
– ఎంఏ ఖదీర్‌పాషా,
మున్సిపల్ కమిషనర్, సిరిసిల్ల

వర్షం పడితే వరదలే..