
రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన
సిరిసిల్లటౌన్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు భగ్గుమన్నాయి. జిల్లా కేంద్రంలో ఆదివారం రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తల్లిని అవమానించేలా చేసిన అసభ్యకర వ్యాఖ్యలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అసభ్య రాజకీయాలు చేస్తోందన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి వ్యాఖ్యలు కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. నాయకులు పల్లం అన్నపూర్ణ, పండుగ మాధవి, నర్సయ్య కొండ నరేశ్, మోర శ్రీహరి, మెరుగు శ్రీనివాస్, దేవరాజ్, మ్యాన రాంప్రసాద్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం
బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించారు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై నిరసన తెలపకుండ ముందస్తుగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించారు. పౌరుల హక్కులను హరించేలా కాంగ్రెస్ పార్టీ చర్యలున్నాయన్నారు.
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
సిరిసిల్ల అర్బన్: మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురష్కరించుకొని ఆదివారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడలశాఖ అధికారి రాందాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సైకిల్‌ర్యాలీ నిర్వహించారు. సిరిసిల్లలోని మినీస్టేడియం నుంచి రాజీవ్‌నగర్ బైపాస్‌రోడ్డు వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. అనంతరం జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు.
సిరిసిల్ల: రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం అన్ని జిల్లాల కలెక్టరేట్‌ల ఎదుట నిరసన చేపడుతున్నట్లు టీజీఈజేఏసీ ప్రకటించింది. కలెక్టరేట్ వద్దకు ఉద్యోగులు ఉదయం 10 గంటలకు రావాలని కోరారు. కలెక్టరేట్ గేట్ ఎదుట ఒక గంట నిరసన తర్వాత భారీ ఎత్తున నిర్వహిస్తున్న హైదరాబాద్ సభకు తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని కోరారు.

రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన