
టోకెన్లు ఇచ్చి.. యూరియా మరిచారు
చందుర్తి(వేములవాడ): సింగిల్‌విండో సిబ్బంది టోకెన్లు ఇచ్చి 20 రోజులు గడుస్తున్నా యూరియా బస్తాలు ఇవ్వడం లేదని మండల కేంద్రంలో ఆదివారం రైతులు నిరసన తెలిపారు. రైతు సంక్షేమసంఘం మండలాధ్యక్షుడు చిలుక పెంటయ్య మాట్లాడుతూ ఈనెల 12న యూరియా బస్తాలు ఇస్తామని జిల్లా వ్యవసాయాధికారి ఆధ్వర్యంలోనే సింగిల్‌విండో సిబ్బంది టోకెన్‌లు ఇచ్చారని.. 20 రోజులు గడుస్తున్నా యూరియా ఇవ్వడం లేదన్నారు. రామన్నపేట మాజీ సర్పంచ్ దుమ్ము అంజయ్య, రైతులు ఏరెడ్డి రాజిరెడ్డి, లక్కర్సు మహేశ్, దుద్దిళ్ల లచ్చిరెడ్డి, నల్మాస్ రవీందర్‌రెడ్డి, లింగాల నారాయణ, మర్రి మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
యూరియా కోసం రైతుల ఆందోళన
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని నిజామాబాద్‌లో రైతులు యూరియా కోసం ఆందోళనకు దిగారు. రైతుల అవసరాలకు సరిపడా యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడికి చేరుకొని మండల వ్యవసాయాధికారి సందీప్‌తో ఫోన్‌లో మాట్లాడించడంతో రైతులు ఆందోళన విరమించారు.

టోకెన్లు ఇచ్చి.. యూరియా మరిచారు