
ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి
సిరిసిల్ల: జిల్లాలో ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలుంటే చెప్పాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో శుక్రవారం రాజకీయపార్టీ నాయకులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2న గ్రామపంచాయతీ తుది ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రచురిస్తామని తెలిపారు. 12 మండలాల పరిధిలో 260 గ్రామపంచాయతీల్లోని 2,268 వార్డుల్లో 3,52,134 ఓటర్లతో డ్రాఫ్ట్ ఓటర్ జాబితా ఈనెల 28న విడుదల చేయనున్నట్లు తెలిపారు. జిల్లాలోని గ్రామపంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా తయారు చేశామని, రాజకీయపార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ జాబితా పరిశీలించి అభ్యంతరాలుంటే ఈనెల 30లోపు తెలియజేయాలని కోరారు. 2,268 డ్రాఫ్ట్ పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలుంటే ఈనెల 30వ తేదీలోపు మండల పరిషత్‌లో అందించాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి షరీఫొద్దీన్, డివిజనల్ పంచాయతీ అధికారి నరేశ్, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, టీడీపీ అధ్యక్షుడు తీగల శేఖర్‌గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు గజభీంకార్ రాజన్న పాల్గొన్నారు.
53 మంది సెర్ఫ్ సిబ్బందికి బదిలీలు
జిల్లాలో పనిచేసే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ఫ్) సిబ్బందికి బదిలీలు జరిగాయి. సెర్ఫ్ సీఈవో ఆదేశాలతో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కౌన్సెలింగ్ నిర్వహించారు. ఎల్–2, ఎల్–1, ఎంఎస్‌సీసీఎస్ 53 మంది ఉద్యోగులకు బదిలీలు చేశారు. డీఆర్డీవో శేషాద్రి, అడిషనల్ డీఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో సెస్ సంస్థకు జిల్లా వ్యాప్తంగా రూ.50లక్షలు నష్టం వాటిల్లిందని ఆ సంస్థ చైర్మన్ చిక్కాల రామారావు తెలిపా రు. తంగళ్లపల్లి సెస్ ఆఫీస్‌లో శుక్రవారం మాట్లాడారు. నీటి ప్రవాహంతో సిబ్బంది చేరుకోలేక గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట, రామంజపురంలో మూడు రోజు లుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిందన్నా రు. తంగళ్లపల్లిలో సుమారు రూ.8లక్షల మేర నష్టం జరిగినట్లు తెలిపారు. సెస్ ఏడీఈ శ్రీధర్, ఏఈ మధుకర్ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలో బుధవారం కురిసిన భారీ వర్షాలకు కూలిన ఇళ్లను సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు శుక్రవారం పరిశీలించారు. తహసీల్దార్ ఫారుక్‌తో కలిసి మండలంలోని వర్ష ప్రభావ పరిస్థితుల గురించి మాట్లాడారు. రేపాక, అనంతారం గ్రామాల్లో కూలిన ఇళ్లను పరిశీలించారు. ఆర్‌ఐ సంతోష్‌కుమార్, కార్యదర్శులు ప్రవీణ్‌కుమార్, విజయలక్ష్మి పాల్గొన్నారు.
టీకాలను జాగ్రత్తగా భద్రపరచాలి
సిరిసిల్ల: జిల్లాలో వ్యాధి నిరోధక టీకాలను జాగ్రత్తగా భద్రపరచాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ ఆరోగ్య కేంద్రాన్ని శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. డ్రై డే పాటించేలా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. అంబేడ్కర్‌నగర్‌లోని కొన్ని ఇళ్లకు వెళ్లి డ్రై డే గురించి స్థానికులకు వివరించారు. డాక్టర్ అభినయ్, సిబ్బంది సోని, మణి ఉన్నారు.

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి

ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు తెలపండి