
లావాదేవీల్లో సైబర్ సెక్యూరిటీ
● డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అర్బన్‌బ్యాంకు ● బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ
సిరిసిల్లటౌన్: డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కి సిరిసిల్ల సహకార అర్బన్‌బ్యాంకును తీసుకొస్తున్నామని, లావదేవీల్లో సైబర్ సెక్యూరిటీ కల్పించామని బ్యాంకు చైర్మన్ రాపెల్లి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. సిరిసిల్ల పద్మశాలి కల్యాణ మండపంలో శుక్రవారం బ్యాంకు 39వ వార్షిక మహాసభలో మాట్లాడారు. బ్యాంకు లావాదేవీలను సభ్యులు, డిపాజిట్‌దారులకు పటిష్టంగా అందించడానికి సైబర్ సెక్యూరిటీ కల్పించామన్నారు. త్వరలోనే మరిన్ని బ్రాంచులను ప్రారంభిస్తామన్నారు. సహకార స్ఫూర్తితో కస్టమర్లకు పారదర్శక సేవలు, సభ్యులకు డివిడెండ్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. బ్యాంకు వైస్‌చైర్మన్ అడ్డగట్ట మురళి, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, చొప్పదండి ప్రమోద్, పాటి కుమార్‌రాజు, బుర్ర రాజు, వేముల సుక్కమ్మ, అడ్డగట్ల దేవదాసు, ఎనగందుల శంకర్, వలుస హరిణి, పత్తిపాక సురేష్, కోడం సంజీవ్, ముఖ్య కార్యనిర్వహణ అధికారి పత్తిపాక శ్రీనివాస్ పాల్గొన్నారు.
పాలకవర్గం తీరుపై రభస
పాలకవర్గం తీరుపై బ్యాంకు సభ్యులు నిరసన తెలిపారు. మహాసభలో వేదిక ముందు బైఠాయించి నినాదాలు చేశారు. బియ్యంకార్ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. బ్యాంక్ పాలకవర్గం సెట్టింగ్ ఫీజు గతంలో రూ.3.51 లక్షలు ఉండగా ఈ సంవత్సరం రూ.6.83 లక్షలు తీసుకున్నారని, మహాసభ ఖర్చులు గతంలో రూ.1.70లక్షలు చేయగా ఈ సంవత్సరం రూ.2.51లక్షలు ఖర్చు చేశారన్నారు. బ్యాంకులో రూ.3.05కోట్లు రుణాలు ఇవ్వకుండా బ్యాంక్‌లో నిల్వ ఉంచడం సరికాదన్నారు.