
ప్రభుత్వ విప్ పూజలు
వేములవాడ: మూలవాగులో జలప్రవాహం రావడంతో శుక్రవారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక పూజలు చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు బాగుండాలని గంగమ్మతల్లిని వేడుకున్నట్లు తెలిపారు. పదేళ్లు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ జిల్లాలో కనీసం బ్రిడ్జీలు కట్టలేదన్నారు. నర్మాల వద్ద పలువురు వరదలో చిక్కుకుంటే కేటీఆర్ వచ్చి రాజకీయాల గురించి మాట్లాడారని విమర్శించారు. కేటీఆర్ అక్కడికి చేరుకునేలోపే హెలికాప్టర్‌లు వచ్చి బాధితులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చాయన్నారు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరంపై చర్చలో పాల్గొనాలని సవాల్ విసిరారు.