
సీఏ చదువుతూ సైబర్‌రక్రైమ్స్
సిరిసిల్లక్రైం: చార్టెడ్ అకౌంటింగ్(సీఏ) చదువుతూ సైబర్ నేరాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర మొబైల్ ఫోన్ల దొంగను సిరిసిల్ల పోలీసులు ఢిల్లీలో పట్టుకున్నారు. ఆరోగ్యశ్రీ పేరుతో మోసం చేస్తున్న ఒకరిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ మహేశ్ బి గీతే తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం వివరాలు వెల్లడించారు. ఢిల్లీకి చెందిన సత్యం సీఏ చదువుతూ మొబైల్‌ఫోన్లు దొంగలించేవాడు. ఆ సెల్‌ఫోన్లు, సిమ్‌కార్డులను తనకు పరిచయమున్న ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా జమ్మలమడుగులోని భాగ్యనగర్‌కాలనీకి చెందిన ముల్లుంటి సలీంమాలిక్‌కు కొరియర్‌లో పంపేవాడు. ఈ ఫోన్‌లతో కాల్‌చేస్తూ ఆరోగ్యశాఖ నుంచి మాట్లాడుతున్నామని నమ్మబలికేవారు. వైద్య ఖర్చులను సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రీఫండ్ చేస్తామని చెప్పి బాధితుల ఫోన్లకు లింక్‌లు పంపి, వారి ఖాతాల్లో నుంచి డబ్బులు కాజేసేవారు. ఇలా ముస్తాబాద్ మండలానికి చెందిన రాజిరెడ్డి ఖాతా నుంచి రూ.46వేలు, వేములవాడకు చెందిన ప్రేమ్‌కుమార్ ఖాతా నుంచి రూ.10వేలు కొల్లగొట్టారు. మోసపోయానని గుర్తించిన రాజిరెడ్డి ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు సలీంమాలిక్‌ను గతంలోనే రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు సత్యంను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. సత్యంపై రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్సీఆర్పీ పోర్టల్‌లో 118 ఫిర్యాదుల్లో దాదాపు రూ.90లక్షల వరకు మోసాలకు ప్పాలడినట్లు తెలిపారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐ మొగిలి, ముస్తాబాద్ ఎస్సై గణేశ్, సైబర్‌టీమ్ ఆర్‌ఎస్సై జునైద్ ఉన్నారు.
● ఆరోగ్యశ్రీ పేరిట మోసం
● ఢిల్లీలో పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు