
నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాట్లు
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఆదేశించారు. మానేరుతీరంలోని విద్యానగర్, ప్రేమ్‌నగర్, వంతెన వద్ద చేస్తున్న ఏర్పాట్లను ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి సోమవారం పరిశీలించారు. కలెక్టర్, ఎస్పీ మాట్లాడుతూ వినాయక మంటపాల నిర్వాహకులు తమ విగ్రహాలను భక్తిశ్రద్ధల మధ్య వేడుకలు నిర్వహిస్తూ వైభవంగా తరలించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు, యువత ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో వేడుకలను విజయవంతం చేయాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషా, సిరిసిల్ల టౌన్ సీఐ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.