
మీసేవ కేంద్రాల నిర్వహణకు ఇంటర్వ్యూ
సిరిసిల్ల అర్బన్: జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వహణకు ఆదివారం రాతపరీక్ష, జిల్లా ఈ గవర్నన్స్ కమిటీ సభ్యుల ద్వారా ఇంటర్వ్యూ నిర్వహించారు. చందుర్తి మండలం మూడపల్లి, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల, వేములవాడ అర్బన్ మండలం తెట్టెకుంట(అగ్రహారం), ముస్తాబాద్ మండలం చీకోడ్, రుద్రంగి మండలం మానాల, సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సుభాష్‌నగర్‌లో నూతన మీసేవ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు రాగా.. ఆదివారం కలెక్టరేట్‌లో రాతపరీక్ష, ఇంఈటర్వ్యూ నిర్వహించారు.